అక్కడ 10 రోజుల పాటు స్వచ్ఛంద లాక్ డౌన్
దిశ, అబ్దుల్లాపూర్ మెట్: కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో గత 20 రోజుల వ్యవధిలో కరోనాతో నలుగురు చనిపోవడం, అనేక మంది మహమ్మారి బారిన పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో తల్లి, కుమారుడు కరోనాకు బలికావడంతో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పాటించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ఉదయం 6 […]
దిశ, అబ్దుల్లాపూర్ మెట్: కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో గత 20 రోజుల వ్యవధిలో కరోనాతో నలుగురు చనిపోవడం, అనేక మంది మహమ్మారి బారిన పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో తల్లి, కుమారుడు కరోనాకు బలికావడంతో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పాటించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దూసరి సుజాత యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. కవాడిపల్లి పరిసరాల్లో అనేక కంపెనీలు ఉండటం, ఇతర రాష్ట్రాల వారు వచ్చి గ్రామంలో నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడం వల్ల కరోనా విజృంభిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు బుధవారం ఉదయం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి, కరోనాను తరిమికొట్టేందుకు సహకరించాలని కోరారు.