వొడాఫోన్ సంస్థకు ఊరట

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ న్యాయస్థానంలో టెలికాం దిగ్గజం వోడాఫోన్‌కు ఊరట లభించింది. భారత ప్రభుత్వానికి బకాయిల చెల్లింపులు రూ. 12 వేలు, పెనాల్టీ చెల్లింపులు రూ. 7,900 కోట్లు మొత్తం రూ. 20 వేల కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉపశమనం లభించిందని వొడాఫోన్ శుక్రవారం వెల్లడించింది. ఎయిర్ వేవ్స్, లైసెన్స్ ఫీజులకు సంబంధించిన వివాదంలో వొడాఫోన్ 2016లో సంస్థ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. వొడాఫోన్ సంస్థపై భారత ప్రభుత్వం పన్ను భారాలను మోపడం, భారత్-నెదర్లాండ్ […]

Update: 2020-09-25 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ న్యాయస్థానంలో టెలికాం దిగ్గజం వోడాఫోన్‌కు ఊరట లభించింది. భారత ప్రభుత్వానికి బకాయిల చెల్లింపులు రూ. 12 వేలు, పెనాల్టీ చెల్లింపులు రూ. 7,900 కోట్లు మొత్తం రూ. 20 వేల కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉపశమనం లభించిందని వొడాఫోన్ శుక్రవారం వెల్లడించింది. ఎయిర్ వేవ్స్, లైసెన్స్ ఫీజులకు సంబంధించిన వివాదంలో వొడాఫోన్ 2016లో సంస్థ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది.

వొడాఫోన్ సంస్థపై భారత ప్రభుత్వం పన్ను భారాలను మోపడం, భారత్-నెదర్లాండ్ మధ్య కుదిరిన పెట్టుబడుల ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నట్టు ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినట్టు వొడాఫోన్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే ఏజీఆర్ బకాయిల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట లభించిన వొడాఫోన్ సంస్థకు, ఇది మరో ఊరట అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏజీఆర్ బకాయిలను పదేళ్లలో చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 20 వేల కోట్ల పన్ను వివాదంలో విజయం లభించిందని వొడాఫోన్ వెల్లడించింది. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో వొడాఫోన్ సాధించిన విజయంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వొడాఫోన్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి షేర్ ధర ఏకంగా 12 శాతం ఎగసి రూ. 10.20 వద్ద ముగిసింది.

Tags:    

Similar News