మరోసారి పరుగులు తీసిన వైజాగ్ వాసులు
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… వైజాగ్‌లోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ఈ మధ్యాహ్నం ఎన్నడూ లేని విధంగా తెల్లని పొగలు కనిపించాయి. రిఫైనరీలోని ఎస్‌హెచ్‌యూ విభాగాన్ని తెరిచే ప్రయత్నంలో తెల్లని పొగలు వచ్చాయి. దట్టంగా కమ్ముకున్న పొగలు ఒక్కసారిగా చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెచ్‌పీసీఎల్ పరిసరాల్లోని సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం తదితర ప్రాంతాల […]
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… వైజాగ్‌లోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ఈ మధ్యాహ్నం ఎన్నడూ లేని విధంగా తెల్లని పొగలు కనిపించాయి. రిఫైనరీలోని ఎస్‌హెచ్‌యూ విభాగాన్ని తెరిచే ప్రయత్నంలో తెల్లని పొగలు వచ్చాయి. దట్టంగా కమ్ముకున్న పొగలు ఒక్కసారిగా చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హెచ్‌పీసీఎల్ పరిసరాల్లోని సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం తదితర ప్రాంతాల వాసులు ఇళ్లలోంచి రోడ్ల మీదకి పరుగులు తీశారు. అయితే పొగలు నెమ్మదిగా తగ్గడంతో ప్రమాదం లేదని భావించి ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై హెచ్‌పీసీఎల్ యాజమాన్యం స్పందిస్తూ, పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని తెలిపారు. దీంతో సమస్యను వెంటనే చక్కదిద్దామని తెలిపింది. ఇప్పుడు ఎలాంటి పొగ రావట్లేదని స్పష్టం చేసింది.