వాహనమిత్రలో వైజాగ్ నెంబర్ వన్
దిశ ఏపీ బ్యూరో: ఆటో, ట్యాక్సీ వాహన యజమానులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర పథకం అమలులో విశాఖపట్టణం జిల్లా నెంబర్ వన్ గా నిలిచిందని విశాఖ రవాణాశాఖ ఉప కమిషనర్ రాజారత్నం తెలిపారు. ఈమేరకు వైజాగ్ లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర’ పథకంలో 2020-21 సంవత్సరానికిగానూ 38,001 మంది లబ్ధిదారులకు 30 కోట్ల రూపాయలు వారివారి ఖాతాల్లో వేశామని చెప్పారు. దీంతో వైజాగ్ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. 29,965 మంది […]
దిశ ఏపీ బ్యూరో: ఆటో, ట్యాక్సీ వాహన యజమానులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర పథకం అమలులో విశాఖపట్టణం జిల్లా నెంబర్ వన్ గా నిలిచిందని విశాఖ రవాణాశాఖ ఉప కమిషనర్ రాజారత్నం తెలిపారు. ఈమేరకు వైజాగ్ లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర’ పథకంలో 2020-21 సంవత్సరానికిగానూ 38,001 మంది లబ్ధిదారులకు 30 కోట్ల రూపాయలు వారివారి ఖాతాల్లో వేశామని చెప్పారు. దీంతో వైజాగ్ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. 29,965 మంది లబ్ధిదారులతో కృష్ణా జిల్లా రెండో స్థానంలో, 29,628 మంది లబ్ధిదారులతో తూర్పుగోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచాయని తెలిపారు.