వైకుంఠపురంలో 18 నుంచి భక్తులకు దర్శనాలు

దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురంలో భక్తులకు బుధవారం నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. లాక్‌డౌన్‌ మూలంగా వైకుంఠపురంలో దాదాపు మూడు నెలలపాటు భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో అన్ని రకాల పూజలు ఏకాంతంగా యధావిధిగా కొనసాగాయని, నిబంధనల దృష్ట్యా భక్తులకు మాత్రం అనుమతి కల్పించలేదని ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ శ్రీమాన్ కందాడై వరదాచార్యులు […]

Update: 2020-06-17 04:47 GMT

దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురంలో భక్తులకు బుధవారం నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. లాక్‌డౌన్‌ మూలంగా వైకుంఠపురంలో దాదాపు మూడు నెలలపాటు భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో అన్ని రకాల పూజలు ఏకాంతంగా యధావిధిగా కొనసాగాయని, నిబంధనల దృష్ట్యా భక్తులకు మాత్రం అనుమతి కల్పించలేదని ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ శ్రీమాన్ కందాడై వరదాచార్యులు అన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నేటి నుంచి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయం ప్రవేశ ద్వారం వద్ద శానిటైజేషన్ టన్నెల్‌ను ఏర్పాటు చేసి, మాస్కులు ధరించిన వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Tags:    

Similar News