చిరు పిలుపుతో విశ్వక్ సేన్ రక్తదానం

కరోనా మహమ్మారి మనుషులను ఎన్ని రకాలుగా కష్ఠపెట్ట వచ్చో అన్ని రకాలుగా కష్టపెడుతోంది. ప్రతి క్షణం ప్రాణభయంతో బతికేలా చేస్తున్న కరోనా… మనుషులను బయటకు రానీయకుండా చేసింది. దీంతో జీవన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం.. ఒకరి కష్టాలు మరొకరికి తెలియకుండా అయిపోయింది. కనీసం ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయలేక పోతున్నాం. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా… రక్తదానం చేసి నిండు జీవితాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాదు తను స్వయంగా […]

Update: 2020-04-26 02:11 GMT
చిరు పిలుపుతో విశ్వక్ సేన్ రక్తదానం
  • whatsapp icon

కరోనా మహమ్మారి మనుషులను ఎన్ని రకాలుగా కష్ఠపెట్ట వచ్చో అన్ని రకాలుగా కష్టపెడుతోంది. ప్రతి క్షణం ప్రాణభయంతో బతికేలా చేస్తున్న కరోనా… మనుషులను బయటకు రానీయకుండా చేసింది. దీంతో జీవన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం.. ఒకరి కష్టాలు మరొకరికి తెలియకుండా అయిపోయింది. కనీసం ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయలేక పోతున్నాం. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా… రక్తదానం చేసి నిండు జీవితాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాదు తను స్వయంగా బ్లడ్ డొనేట్ చేసాడు. చిరు పిలుపుకు స్పందించిన హీరో విశ్వక్ సేన్… చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని ఇచ్చాడు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీలకు రక్తం అవసరం ఉంటుందని తెలిపిన విశ్వక్… మీరు రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే అని తెలిపాడు. దగ్గర్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తం ఇవ్వాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా రక్త దాన శిబిరాలు నిర్వహించ లేక పోతున్నారు అని… కనుక స్వయంగా వెళ్లి బ్లడ్ డొనేట్ చేయాలన్నాడు.

అయితే రక్త దానం చేసేందుకు పోలీసులు అనుమతించరు అనే అపోహ వద్దన్నారు చిరు. మీరు రక్తదానం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు బ్లడ్ బ్యాంక్ వారు మీకు ఫాం పంపిస్తారని… అది పోలీసులకు చూపిస్తే మిమ్మల్ని అనుమతిస్తారని చిరంజీవి ఇంతకు ముందే తెలిపాడు. కనుక ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరూ రక్తం దానం చేయాలని పిలుపునిచ్చారు.


Tags: Chiranjeevi, Vishwaksen, Blood Donation, Chiranjeevi Blood Bank, Tollywood

Tags:    

Similar News