నెలబిడ్డతో విధులు.. నిబద్దతకు ప్రతిరూపం
కరోనా కాటేసిన సమయానికి కాస్త ముందుగా విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్ సృజన పండంటి బిడ్డకు జన్మనిచ్చిరు. అలాంటి సమయాల్లో మహిళలను పచ్చి బాలింతలుగా పేర్కొంటారు. వారిని ఏపనీ చేయనివ్వరు.. నెలలు మోసిన భారం నుంచి కోలుకునేందుకు అవసరమైనంత విశ్రాంతినిస్తారు. రోజుల బిడ్డ పగలు పడుకుని రాత్రి చికాకు పెడతారు. దాని నుంచి తేరుకునేందుకు కూడా సమయం పడుతుంది. మరోవైపు శరీరంలో ఒక్కసారిగా చోటుచేసుకునే మార్పులు. వీటన్నింటితో పోరాడుతూ.. నెల రోజుల పసికందును పట్టుకుని విధులకు హాజరవుతున్నారు […]
కరోనా కాటేసిన సమయానికి కాస్త ముందుగా విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్ సృజన పండంటి బిడ్డకు జన్మనిచ్చిరు. అలాంటి సమయాల్లో మహిళలను పచ్చి బాలింతలుగా పేర్కొంటారు. వారిని ఏపనీ చేయనివ్వరు.. నెలలు మోసిన భారం నుంచి కోలుకునేందుకు అవసరమైనంత విశ్రాంతినిస్తారు. రోజుల బిడ్డ పగలు పడుకుని రాత్రి చికాకు పెడతారు. దాని నుంచి తేరుకునేందుకు కూడా సమయం పడుతుంది. మరోవైపు శరీరంలో ఒక్కసారిగా చోటుచేసుకునే మార్పులు. వీటన్నింటితో పోరాడుతూ.. నెల రోజుల పసికందును పట్టుకుని విధులకు హాజరవుతున్నారు సృజన.
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు విశాఖపట్టణంలో తీవ్రంగా పోరాడుతోంది. లాక్‌డౌన్‌తో పాటు కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ఆమె బాధ్యతలను తలకెత్తుకున్నారు. ఒక చోత్తో తాను జన్మనిచ్చిన బిడ్డను సాకుతూనే.. రెండో చేత్తో మరోబిడ్డ వైజాగ్‌ను శుద్ధి చేసేందుకు నడుం బిగించారు.
విధులకు హాజరవుతూ, కేవలం ఆఫీస్‌కే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే పేద ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడి తన వంతు బాధ్యతను నిర్వరిస్తున్నారు. కరోనా కట్టడికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మార్కెట్లలో రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీధులను శుభ్రం చేయడంతో పాటు, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయించడం వంటి కీలకమైన పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆమె నిబద్దతకు వైజాగ్ ప్రజలు సలాం చేస్తున్నారు.
Tags: gvme, visakhapatnam, ap, municipal commissioner, srujana