హెడ్ కోచ్ రికార్డుకు విరాట్ కోహ్లీ ఎసరు
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచు కోసం టీమిండియా కసరత్తులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక ఈ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. సఫారీ పిచ్‌లపై ద్రవిడ్ మొత్తం 22 మ్యాచులు ఆడగా 624 పరుగులు చేశాడు. ఇక రన్ మెషీన్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌ల్లోనే 558 పరుగులు తీశాడు. ఇక […]
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచు కోసం టీమిండియా కసరత్తులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక ఈ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. సఫారీ పిచ్‌లపై ద్రవిడ్ మొత్తం 22 మ్యాచులు ఆడగా 624 పరుగులు చేశాడు. ఇక రన్ మెషీన్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌ల్లోనే 558 పరుగులు తీశాడు. ఇక మరో 66 పరుగులు తీస్తే ఆ ద్రవిడ్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేసి.. భారత్ తరఫున దక్షిణాఫ్రికా గడ్డ మీద అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సెకండ్ ప్లేస్‌లోకి ఎగబాకుతాడు. ఇక సౌతాఫ్రికా పిచ్‌లో పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. మొత్తం 15 టెస్టు మ్యాచుల్లో మాస్టర్ బ్లాస్టర్ 1161 పరుగులు చేయడం విశేషం.