కోహ్లీ కూతురిపై బెదిరింపుల కేసులో వ్యక్తి అరెస్టు

దిశ, సినిమా : ఇటీవల భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల కూతురు వామికపై అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి రామ్‌ నగేష్ అలీబత్తిని అనే నిందితున్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ సైబర్ సెల్ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన 23 ఏళ్ల నగేష్ ఫుడ్ డెలివరీ యాప్‌లోనూ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం డిలీట్ చేయబడిన ట్విట్టర్ ఖాతా@Criccrazyygirl నుంచి కోహ్లీ […]

Update: 2021-11-10 08:09 GMT

దిశ, సినిమా : ఇటీవల భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల కూతురు వామికపై అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి రామ్‌ నగేష్ అలీబత్తిని అనే నిందితున్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ సైబర్ సెల్ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన 23 ఏళ్ల నగేష్ ఫుడ్ డెలివరీ యాప్‌లోనూ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం డిలీట్ చేయబడిన ట్విట్టర్ ఖాతా@Criccrazyygirl నుంచి కోహ్లీ కుమార్తెపై అత్యాచారం బెదిరింపుకు సంబంధించిన మెసేజ్ సెండ్ చేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన తరువాత భారత బౌలర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ షమీకి మద్దతుగా నిలిచినందుకే నిందితుడు ఈ తరహా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మహిళా కమిషన్ సైతం విరాట్-అనుష్క కుమార్తెపై వచ్చిన బెదిరింపులను సుమోటోగా స్వీకరించి విచారిస్తోంది. ఇక ఈ సంఘటన తర్వాత అనుష్క శర్మ కూడా తన సోషల్ మీడియాలో ‘కోచ్.. మలినమైపోయిన పురుషులను బాగుచేయడం కంటే పిల్లలను పటిష్టంగా తీర్చిదిద్దడం సులభం’ అని ట్వీట్ చేసింది.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma