మృత్యుఒడి నుంచి బయటపడేశారు.. వీడియో వైరల్

దిశ, ఫీచర్స్ : తల్లి లేని లోకంలో ఇక తను కూడా ఉండబోనని నిర్ణయించుకున్న ఓ యువకుడు.. ముంబయిలోని విరార్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై పడుకున్నాడు. ఇంకొద్ది క్షణాలు అలానే ట్రాక్‌పై ఉండుంటే, ఆయన మీదుగా ట్రైన్ వెళ్లి ప్రాణాలు కోల్పోయేవాడు. కానీ, అలా జరగలేదు. యువకుడు సూసైడ్ చేసుకునేందుకే పట్టాలపైకి వచ్చాడని గమనించిన వెంటనే ముగ్గురు ఆర్‌పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) జవాన్లు అలర్ట్ అయ్యారు. పట్టాలపైకి వెళ్లి యువకుడిని పక్కకు ఈడ్చుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో […]

Update: 2021-02-26 08:09 GMT

దిశ, ఫీచర్స్ : తల్లి లేని లోకంలో ఇక తను కూడా ఉండబోనని నిర్ణయించుకున్న ఓ యువకుడు.. ముంబయిలోని విరార్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై పడుకున్నాడు. ఇంకొద్ది క్షణాలు అలానే ట్రాక్‌పై ఉండుంటే, ఆయన మీదుగా ట్రైన్ వెళ్లి ప్రాణాలు కోల్పోయేవాడు. కానీ, అలా జరగలేదు. యువకుడు సూసైడ్ చేసుకునేందుకే పట్టాలపైకి వచ్చాడని గమనించిన వెంటనే ముగ్గురు ఆర్‌పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) జవాన్లు అలర్ట్ అయ్యారు. పట్టాలపైకి వెళ్లి యువకుడిని పక్కకు ఈడ్చుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు ప్రేక్షకుల్లా చూస్తుండగానే ఆర్‌పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై, యువకుడిని కాపాడటం అభినందనీయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News