బంధువులైన విజయ్, అధర్వ

దిశ, వెబ్‌డెస్క్: ఇళయ దళపతి విజయ్ కోడలు.. డైరెక్టర్ స్నేహ బ్రిట్టో, హీరో అధర్వ మురళి సోదరుడు.. ఆకాష్ మురళిల కళ్యాణ మహోత్సవ వేడుక ఆగస్ట్ 24న ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అతికొద్ది మంది బంధుమిత్రుల నడుమ జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వీటిలో అధర్వ బ్లూ సూట్‌లో సూపర్ స్టన్నింగ్‌గా ఉండగా.. విజయ్ పిక్స్ బయటకు రావాల్సి ఉంది. కాగా, ఉన్నత విద్యకోసం సింగపూర్ వెళ్లిన స్నేహ, […]

Update: 2020-08-26 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇళయ దళపతి విజయ్ కోడలు.. డైరెక్టర్ స్నేహ బ్రిట్టో, హీరో అధర్వ మురళి సోదరుడు.. ఆకాష్ మురళిల కళ్యాణ మహోత్సవ వేడుక ఆగస్ట్ 24న ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా అతికొద్ది మంది బంధుమిత్రుల నడుమ జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వీటిలో అధర్వ బ్లూ సూట్‌లో సూపర్ స్టన్నింగ్‌గా ఉండగా.. విజయ్ పిక్స్ బయటకు రావాల్సి ఉంది.

కాగా, ఉన్నత విద్యకోసం సింగపూర్ వెళ్లిన స్నేహ, ఆకాష్ అక్కడే ప్రేమలో పడ్డారు. విషయం ఇంట్లో చెప్తే, ముందుగా పెద్దలు ఒప్పుకోకపోయినా తర్వాత ఓకే చెప్పారు. డిసెంబర్‌లో ఇద్దరికీ నిశ్చితార్థం కాగా.. లాక్‌డౌన్ కారణంగా చాలా కొద్ది మంది ఆప్తుల నడుమ ఈ నెల 24న వివాహం జరిగింది.

స్నేహ.. నిర్మాత జావియర్ బ్రీట్టో కూతురు కాగా, తనే విజయ్ హీరోగా వస్తున్న మాస్టర్ సినిమా నిర్మిస్తున్నాడు.

Tags:    

Similar News