బెజవాడను ముఠాకోరు నగరం గా మార్చేశారు : ఎంపీ కేశినేని నాని

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై విజయవాడ ఎంపీ కేశినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గంజాయి యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన బెజవాడను ముఠాకోరు నగరంగా మార్చశారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు మెుత్తం విజయవాడను దోచుకుంటున్నారని ఆరోపించారు. అడ్డుకుంటున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు వైసీపీ నేతలకు రాచబాట వేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని..జగన్ పాలనలో […]

Update: 2021-08-25 06:55 GMT
nani
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై విజయవాడ ఎంపీ కేశినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గంజాయి యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన బెజవాడను ముఠాకోరు నగరంగా మార్చశారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు మెుత్తం విజయవాడను దోచుకుంటున్నారని ఆరోపించారు. అడ్డుకుంటున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు వైసీపీ నేతలకు రాచబాట వేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని..జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.

Tags:    

Similar News