టీఆర్ఎస్ ఓడితేనే బతుకమ్మకు బతుకు: మాజీ ఎంపి విజయశాంతి
దిశ రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ బతకాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగోట్టాలని అని మాజీ ఎంపీ బిజెపి నాయకురాలు విజయశాంతి అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా నర్కుడలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారేలా చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన […]
దిశ రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ బతకాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగోట్టాలని అని మాజీ ఎంపీ బిజెపి నాయకురాలు విజయశాంతి అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా నర్కుడలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారేలా చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందన్నారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని, ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే కేవలం బీజేపీతోనే సాధ్యం అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.