అభిమన్యుడిలా మట్టుపెట్టాలని చూశారు: విజయసాయి రెడ్డి

దిశ ఏపీ బ్యూరో: భారతంలో అభిమన్యుడిని మట్టుబెట్టినట్టు సీఎం జగన్‌ను ఒంటరిని చేసి మట్టుబెట్టాలని చూశారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా విపక్షాలపై విమర్శలు చేశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని తొమ్మిదేళ్లపాటు స్కెచ్చులు వేశారని అన్నారు. ఆయన గుండె ధైర్యం, పట్టుదల ముందు ప్రత్యర్థులు తోకముడవక తప్పలేదని ఆయన తెలిపారు. ప్రజలకు యువనేత జీవితకాల భరోసాగా నిలిచాడని ఆయన అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు […]

Update: 2020-05-23 09:34 GMT

దిశ ఏపీ బ్యూరో: భారతంలో అభిమన్యుడిని మట్టుబెట్టినట్టు సీఎం జగన్‌ను ఒంటరిని చేసి మట్టుబెట్టాలని చూశారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా విపక్షాలపై విమర్శలు చేశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని తొమ్మిదేళ్లపాటు స్కెచ్చులు వేశారని అన్నారు. ఆయన గుండె ధైర్యం, పట్టుదల ముందు ప్రత్యర్థులు తోకముడవక తప్పలేదని ఆయన తెలిపారు. ప్రజలకు యువనేత జీవితకాల భరోసాగా నిలిచాడని ఆయన అన్నారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన చిరస్మరణీయమైన రోజని ఆయన తెలిపారు. ఏడాది క్రితం ఇదే రోజు, వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసిందని గుర్తు చేశారు. జననేత జగన్ ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారని ఆయన ప్రశంసించారు. తన వెంట నడిచిన ప్రజల కోసం పది తలల విషనాగుతో పోరాడారని ఆయనను ఆకాశానికెత్తారు. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కారని ఆయన టీడీపీని విమర్శించారు.

Tags:    

Similar News