విజయ్ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ థాట్స్

దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సోల్‌ఫుల్ మెలోడీ విన్నంత సాఫీగా సాగిపోతుంది. గుంటూరులో హోటల్ పెట్టాలనుకునే మిడిల్ క్లాస్ అబ్బాయి, దానిని వ్యతిరేకిస్తూనే సపోర్ట్ చేసే నాన్న.. అమ్మాయితో ప్రేమ, పెళ్లి ఆలోచన.. మరో వైపు ఫ్రెండ్ లవ్ స్టోరీ.. ఇలా అన్నీ కలగలిపి సాగే కథలో డైరెక్షన్ కీలకం కాగా.. […]

Update: 2020-11-22 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సోల్‌ఫుల్ మెలోడీ విన్నంత సాఫీగా సాగిపోతుంది. గుంటూరులో హోటల్ పెట్టాలనుకునే మిడిల్ క్లాస్ అబ్బాయి, దానిని వ్యతిరేకిస్తూనే సపోర్ట్ చేసే నాన్న.. అమ్మాయితో ప్రేమ, పెళ్లి ఆలోచన.. మరో వైపు ఫ్రెండ్ లవ్ స్టోరీ.. ఇలా అన్నీ కలగలిపి సాగే కథలో డైరెక్షన్ కీలకం కాగా.. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఈ చిత్రంలోని పాత్రలు చాలా సహజంగా కనిపించగా.. యాక్టర్స్ ప్రాణం పోశారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రంపై తాజాగా విజయ్ దేవరకొండ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

డైరెక్టర్ వినోద్ అనంతోజు బ్యూటిఫుల్ రైటింగ్, డైరెక్షన్ స్కిల్స్ గురించి ప్రస్తావించిన విజయ్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో నీ ప్రెజెన్స్, టాలెంట్ చూపించావ్ అని చెప్పాడు. ఎప్పటికీ సపోర్ట్‌గా ఉంటానని ప్రామిస్ చేసిన విజయ్.. ఫస్ట్ ఫిల్మ్ కాదు, ఏ ఫిల్మ్ అయినా సరే టెర్రిఫిక్‌గా ఉండాలని చెప్పాడు. సపోర్టింగ్ కాస్ట్ కొండల్ రావు, దివ్య, గోపాల్ పాత్రల్లో అద్భుతంగా నటించారని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

సినిమాలో తరుణ్ భాస్కర్ గెస్ట్ అప్పియరెన్స్ గురించి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నానన్న విజయ్.. సినిమా కోసం ఏ పని చేయమన్నా చేసే చాలా కొద్ది మంది నటుల్లో తరుణ్ ఒక్కడని అన్నారు. వర్ష బొల్లమ పెద్ద పెద్ద కళ్లతో చాలా క్యూట్‌గా, అందంగా కనిపించిందని.. టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో స్క్రీన్‌పై అందాన్ని తీసుకొచ్చిందని చెప్పాడు.

ఇక ఆనంద్ దేవరకొండను చూసి బ్రదర్‌గా చాలా గర్వపడుతున్నా అని చెప్పాడు. సినిమా ఎంచుకునే విషయంలో, కథలు సెలెక్ట్ చేసుకునే విధానంలో తనదైన దారిలో వెళ్తున్న ఆనంద్.. మరిన్ని కొత్త స్టోరీలు, డైరెక్టర్లు, యాక్టర్స్‌తో పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఫైనల్‌గా ‘నీ పని నువ్వు చెయ్, అవసరమైతే కాల్ చెయ్’ అని తమ్ముడికి చెప్పాడు విజయ్.

Tags:    

Similar News