అతడే.. నా షారుఖ్ : విద్యాబాలన్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి విద్యాబాలన్.. ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు యూనిక్ ఆన్సర్ ఇచ్చింది. సోమవారం ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో పాల్గొన్న విద్యను అభిమానులు తమ ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా తన సమాధానాలతో ఆశ్చర్యపరిచింది. ఈ సెషన్లో ‘ఎస్ఆర్కే లేదా సల్మాన్’ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారని ఓ అభిమాని అడగ్గా.. తన భర్త సిద్దార్ధ్ రాయ్ కపూర్ ఫొటో షేర్ చేసిన విద్య.. ‘తనే నా షారుఖ్’ అంటూ హార్ట్ ఎమోజీతో రిప్లయ్ ఇచ్చింది. […]
దిశ, సినిమా : బాలీవుడ్ నటి విద్యాబాలన్.. ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు యూనిక్ ఆన్సర్ ఇచ్చింది. సోమవారం ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో పాల్గొన్న విద్యను అభిమానులు తమ ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా తన సమాధానాలతో ఆశ్చర్యపరిచింది. ఈ సెషన్లో ‘ఎస్ఆర్కే లేదా సల్మాన్’ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారని ఓ అభిమాని అడగ్గా.. తన భర్త సిద్దార్ధ్ రాయ్ కపూర్ ఫొటో షేర్ చేసిన విద్య.. ‘తనే నా షారుఖ్’ అంటూ హార్ట్ ఎమోజీతో రిప్లయ్ ఇచ్చింది.
ఇదే ఆన్సర్‌కు కట్టుబడి ఉంటారా? అని మరో ఫ్యాన్ ప్రశ్నించగా.. ‘అలాగే అనిపిస్తోంది’ అంటూ సిద్దార్థ్‌తో ఉన్న మరో ఫొటోను షేర్ చేసింది. ఈ క్రమంలో 1979లో వచ్చిన కామెడీ మూవీ ‘గోల్మాల్’ తన ఫేవరెట్ కాగా.. ఇటలీ ఇంట్రెస్టింగ్ వెకేషన్ స్పాట్ అని తెలిపింది. ఇక జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్న ‘షేర్ని’లో స్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రోల్లో కనిపించనుంది విద్య. అమృత్ మసూర్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. మనుషులు, జంతువుల మధ్య వైరుధ్యాలకు సంబంధించిన సంక్షిష్ట సమస్యలను చర్చించనుంది.