పెళ్లికూతురు చేస్తోందిరా తగ్గొద్దు మామ అంటున్న ఫ్రెండ్స్... అబ్బో సిగ్గేస్తోందంటున్న పెళ్లి కొడుకు.. (వీడియో)
ఈ మధ్య పెళ్లి వేడుకల సందర్భంగా జరుగుతున్న కొన్ని సన్ని వేశాలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా...Viral Video of New Couple Dance
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పెళ్లి వేడుకల సందర్భంగా జరుగుతున్న కొన్ని సన్ని వేశాలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.... ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ వేడుకలో పెళ్లి కూతురు పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంది. అయితే, పెళ్లికొడుకు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు. అయితే, ఇది గమనించిన ఫ్రెండ్స్, బంధువులు అతడిని నువ్వు కూడా చెయ్ మామ అంటూ అతడిని నెట్టివేస్తారు. అయినా కూడా అతను సిగ్గుతో అలాగే పక్కకు వెళ్తాడు. ఇదంతా వీడియో తీసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. నెటిజన్స్ చూసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.