కూతురి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్తున్న తండ్రి...వీడియో చూస్తే కన్నీళ్లాగవు!

దిశ, వెబ్ డెస్క్: నాలుగేళ్ల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి...No Ambulance, Man Carries 4-Year-Old Son's Body In Arms

Update: 2022-06-10 07:03 GMT

దిశ, వెబ్ డెస్క్: నాలుగేళ్ల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే బాలిక మృతిచెందింది. అయితే, ఆ బాలిక మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు తండ్రి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్ పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కూతురు అనారోగ్యానికి గురికావడంతో ఆమెను సోమవారం బక్స్ వాహా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మంగళవారం దమోహ్ లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే బాలిక మృతిచెందింది. అయితే, బాలిక మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ బస్సెక్కి ఊరు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది తమకు అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారని, అదేవిధంగా ప్రైవేట్ అంబులెన్స్ లో తీసుకెళ్లేందుకు తమ వద్ద డబ్బు లేకపోవడంతో చేసేదేమి లేక బాలిక మృతదేహాన్ని తండ్రి భుజాలపై మోసుకొచ్చాడంటూ బాలిక తాత చెప్పుకొచ్చాడని, బక్స్‌వాహా చేరుకున్న తర్వాత, మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనాన్ని అందించాలని నగర పంచాయతీని కోరామని, అయితే వారు కూడా నిరాకరించారని బాలిక తండ్రి పేర్కొన్నట్లు అందులో తెలిపారు. 


Similar News