కౌశల్‌తో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అప్పుడేనా?
దిశ, సినిమా : టాలెంటెట్ యాక్టర్ విక్కీ కౌశల్, గార్జియస్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ల రిలేషన్షిప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందన్న వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం అదేం లేదంటూ కొట్టిపారేశారు. ఈ సంగతి పక్కనబెడితే తాజాగా మరో గాసిప్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. కత్రినా-విక్కీ డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకోనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ స్టార్ […]
దిశ, సినిమా : టాలెంటెట్ యాక్టర్ విక్కీ కౌశల్, గార్జియస్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ల రిలేషన్షిప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందన్న వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం అదేం లేదంటూ కొట్టిపారేశారు. ఈ సంగతి పక్కనబెడితే తాజాగా మరో గాసిప్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. కత్రినా-విక్కీ డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకోనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ స్టార్ కపుల్ మాత్రం ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాలు కూడా వాళ్లిద్దరూ గ్రేట్ ఫ్రెండ్స్ అని, ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని చెబుతున్నారు. కానీ వారి పెళ్లి విషయంపై మాట్లాడటం లేదు. ఓసారి బాలీవుడ్ ప్రేమకథలను పరిశీలించినా.. పెళ్లిదాకా వెళ్లేవరకు ఖచ్చితంగా చెప్పలేం. సినిమాల విషయానికొస్తే కత్రినా.. సల్మాన్‌తో కలిసి నటిస్తున్న ‘టైగర్ 3’ షూటింగ్ కోసం టర్కీకి వెళ్లింది. కాగా విక్కీ.. శ్యామ్ మాణెక్ షా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడు.