త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు ‘కమల’దళపతులు
రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త కమల దళపతులు రాబోతున్నారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యసాగర్ రావు తెలిపారు. గురువారం బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డాతో భేటి అయిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి కొ్త్త అధ్యక్షుల నియామకం అనంతరం బీజేపీ నూతనోత్సాహంతో ముందుకు వెళ్లనుందన్నారు.తెలంగాణలో టీఆరెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించిందని వివరించారు. ఏపీలో కూడా త్వరలోనే పలు మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఏఏ వలన భారతీయ ముస్లిములకు ఏలాంటి […]
రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త కమల దళపతులు రాబోతున్నారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యసాగర్ రావు తెలిపారు. గురువారం బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డాతో భేటి అయిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి కొ్త్త అధ్యక్షుల నియామకం అనంతరం బీజేపీ నూతనోత్సాహంతో ముందుకు వెళ్లనుందన్నారు.తెలంగాణలో టీఆరెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించిందని వివరించారు.
ఏపీలో కూడా త్వరలోనే పలు మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఏఏ వలన భారతీయ ముస్లిములకు ఏలాంటి ఇబ్బందులు లేకపోయిన టీఆరెస్,కాంగ్రెస్,మజ్లీస్ రాజకీయ అవసరాల కోసం ఆందోళనలు చేయడం దురదృుష్టకరమన్నారు. జాతి సమైక్యతకు సీఏఏ, ఎన్ఆర్సీ,ఎన్పీఆర్ అవసరం ఎంతో ఉందని తెలిపారు.ముస్లిం యువత జాతీయ జెండాతో బయటకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని కానీ, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారు వందేమాతరం,జనగణమనలను అలపించి కార్యక్రమాన్నిముగించగలరా? అని సవాల్ విసిరారు. మజ్లీస్ పార్టీ కోసమే అధికార పార్టీ తెలంగాణలో సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించడం లేదని, కర్ణాటక,మహారాష్ట్రలను చూసి నేర్చుకోవాలని విద్యాసాగర్ రావు హితవు పలికారు. మాతృభాష ఔన్నత్యాన్ని చాటేందుకు రేపు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నామని వివరించారు.