అజాతశత్రవు మృతిపట్ల వెంకయ్య ప్రగాఢ సానుభూతి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు వరదరాజు దొరస్వామి రాజు మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. పంపిణీదారుడిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగిన దొరస్వామి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సినీ నిర్మాతగా విలువలతో కూడిన అనేక కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన ఆయన సినీ ప్రయాణం ఉన్నతమైందన్నారు. వీటితో పాటు అనేక భక్తి రస చిత్రాల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చిరయశస్సును సంపాదించుకున్నారని వెంకయ్య నాయుడు గుర్తు […]

Update: 2021-01-19 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు వరదరాజు దొరస్వామి రాజు మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. పంపిణీదారుడిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగిన దొరస్వామి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సినీ నిర్మాతగా విలువలతో కూడిన అనేక కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన ఆయన సినీ ప్రయాణం ఉన్నతమైందన్నారు. వీటితో పాటు అనేక భక్తి రస చిత్రాల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చిరయశస్సును సంపాదించుకున్నారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. నగరి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యునిగా దొరస్వామి రాజు అందించిన సేవలు అనుపమానమైనవన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో, రాజకీయ రంగంలో అజాత శత్రవుగా అందరి అభిమానాన్ని చూరగొన్న దొరస్వామి రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయకుడు సంతాపం తెలియజేశారు.

Tags:    

Similar News