బడ్జెట్ సమావేశాల్లో కనిపించనున్న చెన్నమనేని?

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఈ నెల 15న జరగనున్న బడ్జెట్ సెషన్స్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 20న లేదా ఆ తరువాత అయినా అసెంబ్లీకి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పౌరసత్య వివాదంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఇండియాలో లేడని, జర్మనిలో ఉన్నాడని రమేశ్ బాబు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రమేశ్ […]

Update: 2021-03-12 11:01 GMT
Vemulawada MLA Chennamaneni Ramesh
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఈ నెల 15న జరగనున్న బడ్జెట్ సెషన్స్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 20న లేదా ఆ తరువాత అయినా అసెంబ్లీకి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పౌరసత్య వివాదంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఇండియాలో లేడని, జర్మనిలో ఉన్నాడని రమేశ్ బాబు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రమేశ్ బాబు జర్మనీ పౌరుడేనని హై కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే పౌరసత్యవంపై నేడో, రేపో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు రమేశ్ బాబు ఇక ఇండియాకు రాడని,హై కోర్టు తీర్పు తర్వాత వేములవాడలో ఉప ఎన్నికలు జరుగుతాయా? లేక రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి అవకాశం ఇస్తారా? అనే చర్చ కొనసాగగా, ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే బడ్జెట్ సెషన్స్‌కు హాజరు కానున్నారనేదానిపై జోరుగా చర్చ నడుస్తున్నది.

Tags:    

Similar News