జగన్ కేబినెట్‌ నుంచి ఆ మంత్రి ఔట్..?

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. రెండున్నరేళ్లకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రమాణ స్వీకారం నాడే సీఎం జగన్ ప్రకటించారు. ఆ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత జగన్ కేబినెట్‌లో ఉండేది ఎవరు? బయటకు వెళ్లేది ఎవరు? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ కేబినెట్‌లో కొలువుదీరిన మంత్రులలో ఎవరికి కలిసొచ్చింది..? ఎవరికి కలిసిరాలేదు..? ఏమంత్రి ఏయే వివాదాల్లో ఇరుక్కున్నారు? అన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే కృష్ణా జిల్లాకు చెందిన […]

Update: 2021-06-11 07:26 GMT
jagan cabinet
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. రెండున్నరేళ్లకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రమాణ స్వీకారం నాడే సీఎం జగన్ ప్రకటించారు. ఆ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత జగన్ కేబినెట్‌లో ఉండేది ఎవరు? బయటకు వెళ్లేది ఎవరు? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ కేబినెట్‌లో కొలువుదీరిన మంత్రులలో ఎవరికి కలిసొచ్చింది..? ఎవరికి కలిసిరాలేదు..? ఏమంత్రి ఏయే వివాదాల్లో ఇరుక్కున్నారు? అన్న దానిపై చర్చ జరుగుతోంది.

అయితే కృష్ణా జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై పెద్ద చర్చే జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో దాడులు, అదేవిధంగా పలు దేవాలయాల్లో అవినీతి వంటి అంశాల నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయాల్లో దాడులను అరికట్టడంలో వెల్లంపల్లి విఫలమయ్యారని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా దుర్గగుడిలోని వెండి సింహాల మాయం ఘటన ప్రతిపక్షాలకు ఒక అస్త్రంలా మారింది. ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. దాడులు అరికట్టడం, దుర్గగుడిలో అవినీతి, తిరుమల కొండపై అన్యమత ప్రచారం వంటి వాటిని అరికట్టడంలో దూకుడు ప్రదర్శించలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ అహర్నిశలు శ్రమించారు. టీడీపీ కీలక నేతలను ఢీ కొట్టి విజయవాడ కార్పొరేషన్‌ను వైసీపీ ఖాతాలో వేయడంలో సక్సెస్ అయ్యారు. ఇది కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి సీఎం జగన్ మదిలో ఏముంది.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ మంత్రి పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News