ఇళ్ల వద్దకే కూరగాయలు
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఇళ్ల వద్దకే కూరగాయలు పంపుతున్నట్టు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. పట్టణంలోని దివ్య గార్డెన్‌లో కూరగాయలను ప్యాక్ చేసి వాహనాల్లో వార్డులకు తరలించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపుతున్నామని పేర్కొన్నారు. కూరగాయల వాహనాలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఇంటికి ఒకరు […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఇళ్ల వద్దకే కూరగాయలు పంపుతున్నట్టు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. పట్టణంలోని దివ్య గార్డెన్‌లో కూరగాయలను ప్యాక్ చేసి వాహనాల్లో వార్డులకు తరలించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపుతున్నామని పేర్కొన్నారు. కూరగాయల వాహనాలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఇంటికి ఒకరు మాత్రమే వచ్చి కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు పాల్గొన్నారు.
Tags: vegetable, vehicle, normal, stress, collector, nirmal