సరూర్‌నగర్ స్టేడియంలో కూరగాయల మార్కెట్

దిశ, రంగారెడ్డి: ఎల్బీనగర్‎లోని కూరగాయల మార్కెట్‎ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలిస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసి తగు ఏర్పాట్లకు సూచనలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, పలు ఖాళీ ప్రదేశాలకు కూరగాయల మార్కెట్లు తరలిస్తున్నామని ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ […]

Update: 2020-03-31 04:29 GMT

దిశ, రంగారెడ్డి: ఎల్బీనగర్‎లోని కూరగాయల మార్కెట్‎ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలిస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసి తగు ఏర్పాట్లకు సూచనలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, పలు ఖాళీ ప్రదేశాలకు కూరగాయల మార్కెట్లు తరలిస్తున్నామని ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ ప్రభలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయలు అందిస్తామని ఆయన తెలిపారు. ఆయా అపార్ట్ మెంట్లు, కాలనీ వాసుల నుంచి గత నాలుగు రోజులుగా మంచి స్పందన లభిస్తుందన్నారు. కూరగాయలు కావాల్సిన కాలనీ, అపార్ట్ మెంట్ల వాసులు 7330733212 నంబరుకు కాల్ చేసి నమోదు చేసుకుంటే వాహనం వచ్చే సమయం చెబుతారని తెలిపారు. మొబైల్ రైతుబజార్ నడపాలనుకుంటున్న యువకులు, ఇతరులు కూడా ఈ నంబరును సంప్రదించవచ్చు అన్నారు.

Tags: niranjan reddy, visit, Vegetable Market, Saroornagar Stadium, hyderabad

Tags:    

Similar News