షారుక్‌ను చూస్తూ స్టాచ్యూ అయిపోయా: వరుణ్‌తేజ్

        మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ … డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. గతేడాది గద్దలకొండ గణేష్‌గా అదరగొట్టిన వరుణ్ విలన్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విలన్‌గా వావ్ అనిపించిన వరుణ్ బాక్సర్‌గా వచ్చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చే సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం ముంబైలో ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేష్ ఉడయాక్, బాక్సర్ నీరజ్ గోయత్ల దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. […]

Update: 2020-02-05 01:34 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ … డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. గతేడాది గద్దలకొండ గణేష్‌గా అదరగొట్టిన వరుణ్ విలన్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విలన్‌గా వావ్ అనిపించిన వరుణ్ బాక్సర్‌గా వచ్చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చే సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం ముంబైలో ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేష్ ఉడయాక్, బాక్సర్ నీరజ్ గోయత్ల దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.

అయితే ముంబైలో ట్రైనింగ్‌కు వెళ్లిన వరుణ్‌కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని? ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానం … కింగ్‌ఖాన్ షారుక్‌ఖాన్. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, హైదరాబాద్‌లో రామ్‌చరణ్ తేజ్ ఇంటికి వచ్చినప్పుడు షారుక్‌ను చూశానని, కానీ అలాగే చూస్తూ ఉండిపోయి ఏమి మాట్లాడలేకపోయానని అన్నారు వరుణ్. కాఫీ తాగుతూ షారుక్‌తో మాట్లాడాలని, ఆయనతో కలిసి నటించాలని ఉందని తెలిపాడు. బాలీవుడ్ చిత్రాల్లో నటించాలని ఉందని, కానీ షెడ్యూల్స్ సహకరించడం లేదన్నారు. కంటెంట్ బాగుంటే భాషాభేదం లేకుండా నటించేందుకు సిద్ధమని చెప్పాడు వరుణ్.

Tags:    

Similar News