‘ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి’
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలు తెలిపితే గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలు తెలిపితే గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, సభలను మాత్రం పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో విపక్ష నేతలపై పోలీసులు అనుసరిస్తున్న తీరుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో కోరారు.