బయట వర్షం, ఇంట్లో చలి.. వేడి వేడిగా కరకరలాడే క్యాబేజీ మినప్పప్పు వడలు రెడీ చేసుకుని తినండి!

ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా చలిగా కూడా ఉండటంతో చాలా మంది స్పైసీగా ఏదైనా తినాలని ఆలోచిస్తుంటారు. కొందరు బయట నుంచి బజ్జీలు, పకోడి లాంటివి ఆర్డర్

Update: 2024-07-21 06:36 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా చలిగా కూడా ఉండటంతో చాలా మంది స్పైసీగా ఏదైనా తినాలని ఆలోచిస్తుంటారు. కొందరు బయట నుంచి బజ్జీలు, పకోడి లాంటివి ఆర్డర్ పెట్టుకొని తింటారు. కాగా, బయట ఫుడ్ కాకుండా, ఇంట్లోనే వేడివేడిగా కరకరలాడే క్యాబేజీ మినప్పప్పు వడలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దీనికి కావలసిన ఆహార పదార్థాలు :

అరకప్పు శనగపప్పు

అరకప్పు మినప పప్పు

రెండు కప్పుల క్యాబేజీ తరుగు

అల్లం

కొత్తిమీర

పచ్చిమిర్చి రెండు

జీలకర్ర

మిరియాలు

ఇంగువ

ఉప్పు

నూనె

తయారీ విధానం : వడలు చేయడానికి ఒక రోజు ముందే మినపప్పు, శనగపప్పు శుభ్రంగా కడిగి,నానబెట్టుకోవాలి. తర్వాత ప్పులు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీని ఒక బౌల్‌లోకి తీసుకొని జీలకర్ర, కొత్తిమీర, క్యాబేజీ తరుగు, కరివేపాకు,, మిరియాలు, ఇంగువ, ఉప్పు వీటన్నింటిని వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి, ఢీ ప్రైకి సరిపడ నూనె తీసుకొని, అందులో పిండిని వడల్లా ఒత్తుకొని, నూనెలో వేసి వేయించుకోవాలి. వీటి రంగు మారాక, తీసి మరోబౌల్‌లో వేసుకోవాలి. అంతే వేడి వేడి వడలు రెడీ.


Similar News