యూఎస్ అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఇండో అమెరికన్
దిశ, ఫీచర్స్ : అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తన మంత్రి వర్గంలో ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారత సంతతి మహిళ వనితా గుప్తా నియమించబడ్డారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేత జాతీయేతర, తొలి భారత సంతతి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఈ నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ సెనేట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వనిత 51 ఓట్లు సాధించింది. అయితే […]
దిశ, ఫీచర్స్ : అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తన మంత్రి వర్గంలో ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారత సంతతి మహిళ వనితా గుప్తా నియమించబడ్డారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేత జాతీయేతర, తొలి భారత సంతతి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఈ నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ సెనేట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వనిత 51 ఓట్లు సాధించింది.
అయితే సెనేట్‌లో రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెరో 50 మంది సభ్యులుండగా.. రిపబ్లికన్ నేత, సెనేటర్ లీసా మర్కోస్కీ మద్దతు పలకడం వల్ల 51-49 స్వల్ప ఆధిక్యంతో 46 ఏళ్ల వనిత విజయం సాధించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు అభినందనలు తెలిపారు. ఇక తన కెరీర్ విషయానికొస్తే మొదట ఎన్‍ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్‍లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వనిత.. ఆ తర్వాత అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‍లో విధులు నిర్వర్తించింది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించింది.