వానిష్ మోడ్ వచ్చేసింది!

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లను ఒకే మెసెంజర్‌గా మార్చిన తర్వాత మొదటి ఫీచర్‌గా వానిష్ మోడ్‌ను ఫేస్‌బుక్ ప్రవేశపెట్టింది. స్నాప్‌చాట్ నుంచి ప్రేరణ తీసుకుని రూపొందించిన ఈ మోడ్‌లో ఉన్నపుడు యూజర్‌లు పంపించిన మెసేజ్, ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లు అవతలి యూజర్ చూడగానే మాయమైపోతాయి. అలా చాట్ విండో ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వానిష్ మోడ్ కేవలం వ్యక్తిగత చాట్‌లకు మాత్రమే వర్తిస్తోంది. గ్రూప్ చాట్‌లకు ఇంకా ఈ ఫీచర్ […]

Update: 2020-11-13 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లను ఒకే మెసెంజర్‌గా మార్చిన తర్వాత మొదటి ఫీచర్‌గా వానిష్ మోడ్‌ను ఫేస్‌బుక్ ప్రవేశపెట్టింది. స్నాప్‌చాట్ నుంచి ప్రేరణ తీసుకుని రూపొందించిన ఈ మోడ్‌లో ఉన్నపుడు యూజర్‌లు పంపించిన మెసేజ్, ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లు అవతలి యూజర్ చూడగానే మాయమైపోతాయి. అలా చాట్ విండో ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వానిష్ మోడ్ కేవలం వ్యక్తిగత చాట్‌లకు మాత్రమే వర్తిస్తోంది. గ్రూప్ చాట్‌లకు ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. శుక్రవారం అమెరికాతోపాటు కొన్ని ఇతర దేశాల్లోని మెసెంజర్ యూజర్‌లకు ఈ వానిష్ మోడ్ అందుబాటులోకి వచ్చింది.

మెసెంజర్‌లోని చాట్ సెట్టింగ్‌లలో ఈ వానిష్ మోడ్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇప్పటికే మెసెంజర్‌లో ఉన్న సీక్రెట్ కన్వర్జేషన్ మోడ్‌కు ఈ వానిష్ మోడ్ దాదాపు ఒకే విధమైన పోలికలను కలిగి ఉంది. సీక్రెట్ కన్వర్జేషన్ మోడ్‌ ద్వారా చేసిన మెసేజ్‌లు పరికరంలో ఎక్కడో ఒకచోట సేవ్ అయ్యి ఉంటాయి. కానీ, వానిష్ మోడ్‌లో మెసేజ్‌లు శాశ్వతంగా డిలీట్ అవుతాయి. స్నాప్‌చాట్ మాదిరిగానే ఈ వానిష్ మోడ్‌లో కూడా ఎవరైనా స్క్రీన్‌షాట్ తీసుకుంటే, మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసుకున్నట్లుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇప్పటికే ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కూడా ఈ వానిష్ మోడ్‌లో అందుబాటులో ఉంటుందని ఫేస్‌బుక్ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Tags:    

Similar News