రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఆపండి 

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు బుధవారం స్వీకరించింది. జులై 30 న టీఎస్ ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. ఆయన వేసిన పిటిషన్ ను నేడు న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి, […]

Update: 2020-08-05 07:02 GMT

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు బుధవారం స్వీకరించింది. జులై 30 న టీఎస్ ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.

ఆయన వేసిన పిటిషన్ ను నేడు న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఏ.ఎం.ఆర్.పి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వంశీచంద్ తన పిటిషన్ ద్వారా హైకోర్టును కోరారు.

Tags:    

Similar News