వలిగొండ భారత్ పెట్రోల్ బంక్… పెట్రోల్‌కు బదులు వాటర్ …
దిశ, భువనగిరి రూరల్ : రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు అందకుండా ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధర రూ.101 లు దాటింది. మరోవైపు పెట్రోల్ బంకుల యజమానులు కల్తీలకు పాల్పడుతూ వాహనదారులను మోసం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ లో గత నాలుగు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ పోయించుకున్న వాహనాలు మొరాయించడం ప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లగా.. పెట్రోల్ […]
దిశ, భువనగిరి రూరల్ : రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు అందకుండా ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధర రూ.101 లు దాటింది. మరోవైపు పెట్రోల్ బంకుల యజమానులు కల్తీలకు పాల్పడుతూ వాహనదారులను మోసం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ లో గత నాలుగు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ పోయించుకున్న వాహనాలు మొరాయించడం ప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లగా.. పెట్రోల్ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వాహన ట్యాంకుల్లో ఉన్న పెట్రోల్ ను వాటర్ బాటిళ్లలోకి తీసి చూడగా.. నీళ్లు, పెట్రోల్ వేర్వేరుగా కనిపించాయి. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. సరైన సమాధానం చెప్పలేదు. ఈలోగా యజమాని కొంతమంది స్థానికులతో వచ్చి వారికి సర్ధి చెప్పి పంపించారు. అయితే పెట్రోల్ ను కల్తీ చేసి మోసం చేస్తున్న భారత్ పెట్రోల్ బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన బోలుగుల విష్ణు డిమాండ్ చేశాడు. కల్తీ పెట్రోల్ తో తన బైక్ పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు పెట్రోల్ పంప్ ను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు.