18 ఏళ్లు పైబడిన వాళ్లకు 11 రాష్ట్రాల్లోనే టీకా
న్యూఢిల్లీ: ఈ నెల నుంచి 18ఏళ్లు పైబడినవారికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. చాలా రాష్ట్రాలు వారికి ఉచితంగా వేస్తామనీ ప్రకటనలు చేశాయి. కానీ, టీకా కొరతతో ఈ మహాకార్యం అనుకున్నట్టుగా ప్రారంభం కాలేదు. టీకా స్టాకు లేక చాలా రాష్ట్రాలు 18ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీని వాయిదా వేస్తున్నాయి. కేంద్రప్రభుత్వ సమాచారం ప్రకారం, దేశంలో ఇప్పటి వరకు కేవలం 11 రాష్ట్రాలే ఈ పంపిణీని ప్రారంభించినట్టు తెలిసింది. మిగతా 21 రాష్ట్రాలు టీకా సప్లై […]
న్యూఢిల్లీ: ఈ నెల నుంచి 18ఏళ్లు పైబడినవారికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. చాలా రాష్ట్రాలు వారికి ఉచితంగా వేస్తామనీ ప్రకటనలు చేశాయి. కానీ, టీకా కొరతతో ఈ మహాకార్యం అనుకున్నట్టుగా ప్రారంభం కాలేదు. టీకా స్టాకు లేక చాలా రాష్ట్రాలు 18ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీని వాయిదా వేస్తున్నాయి. కేంద్రప్రభుత్వ సమాచారం ప్రకారం, దేశంలో ఇప్పటి వరకు కేవలం 11 రాష్ట్రాలే ఈ పంపిణీని ప్రారంభించినట్టు తెలిసింది. మిగతా 21 రాష్ట్రాలు టీకా సప్లై కోసం ఎదురుచూస్తున్నాయి. 18ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసులవారికి పంపిణీని ప్రారంభించలేదు.
ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ 18ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీని ప్రారంభించగలిగాయి. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు మూడు లక్షల డోసులు చేరినట్టు సమాచారం. ఢిల్లీ 4.5 లక్షల డోసులు, జమ్ము కశ్మీర్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లకు 1.5 లక్షల డోసుల చొప్పున చేరినట్టు ఓ కథనం వెల్లడించింది.