వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్.. ప్రభుత్వం ఉత్తర్వులు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వీలు కుదరని వారు పండుగ సెలవుల్లో వేసుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురుకానుంది. వ్యాక్సిన్కోసం వారు నాలుగు రోజులు ఆగక తప్పడంలేదు. ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. బతుకమ్మ, దసరాతో పాటు శని, ఆదివారాలు రావడంతో నాలుగు […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వీలు కుదరని వారు పండుగ సెలవుల్లో వేసుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురుకానుంది. వ్యాక్సిన్కోసం వారు నాలుగు రోజులు ఆగక తప్పడంలేదు. ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. బతుకమ్మ, దసరాతో పాటు శని, ఆదివారాలు రావడంతో నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్ ప్రక్రియకు బ్రేక్పడనుంది. ఈమేరకు తెలంగాణ సర్కార్ఆదేశాలు జారీ చేసింది.