టీకా కోవాగ్జిన్ సేఫే.. కానీ..
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అంతం చేయడానికి భారత్ తయారుచేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ సేఫేనని లాన్సెట్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ఇటీవలే ఫేస్-2 క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న సమయంలోనే జనవరి నుంచి దీనిని అత్యవసర వినియోగానికి అనుమతినివ్వడం తెలిసిందే. కాగా ఫేస్-2 ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. టీకా సామర్థ్యంపై లాన్సెట్ స్పందిస్తూ.. కోవాగ్జిన్ సేఫేగానీ, దాని […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అంతం చేయడానికి భారత్ తయారుచేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ సేఫేనని లాన్సెట్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ఇటీవలే ఫేస్-2 క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న సమయంలోనే జనవరి నుంచి దీనిని అత్యవసర వినియోగానికి అనుమతినివ్వడం తెలిసిందే.
కాగా ఫేస్-2 ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. టీకా సామర్థ్యంపై లాన్సెట్ స్పందిస్తూ.. కోవాగ్జిన్ సేఫేగానీ, దాని సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. ఫేస్-2 ఫలితాలు వచ్చినంత మాత్రానా దాని సామర్థ్యాన్ని అంచనా వేయలేమని పేర్కొంది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను 12-18 ఏళ్లవారిపై, 55-65 ఏళ్ల వారిమీద మాత్రమే నిర్వహించారనీ.. కానీ ఇది చిన్న పిల్లలు, వృద్ధుల మీద ఎలా పనిచేస్తుందనేది తేలాల్సి ఉందని వివరించింది. ఇదిలాఉండగా భారత్ బయోటెక్ మాత్రం.. కోవాగ్జిన్ అన్ని విధాలా సేఫ్ అనీ, రోగ నిరోధకతను పెంపొందించుతుందని తెలపడం గమనార్హం.