టీకా కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్.. వారికి మాత్రమే అవకాశం
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44ఏళ్ల వయసున్న వారికీ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశం కేవలం ప్రభుత్వ నిర్వహణలోని టీకా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండనుంది. ప్రైవేటు కేంద్రాల్లో టీకా కోసం తప్పనిసరిగా కొవిన్‌లో ఆన్‌లైన్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సిందే. అయితే, ప్రైవేటు కేంద్రాలు తప్పకుండా ఏ రోజుకారోజూ టీకా పంపిణీ వివరాలు […]
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44ఏళ్ల వయసున్న వారికీ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశం కేవలం ప్రభుత్వ నిర్వహణలోని టీకా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండనుంది. ప్రైవేటు కేంద్రాల్లో టీకా కోసం తప్పనిసరిగా కొవిన్‌లో ఆన్‌లైన్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సిందే. అయితే, ప్రైవేటు కేంద్రాలు తప్పకుండా ఏ రోజుకారోజూ టీకా పంపిణీ వివరాలు ప్రచురించాల్సి ఉంటుంది.
ఈ ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్‌పై తుది నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కేవలం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా స్మార్ట్ ఫోన్, లేదా డిజిటల్ అక్షరాస్యత లేనివారికి టీకా పొందడం పెద్ద సవాల్‌గా మారిందని, దీనికితోడు టీకా వృథానూ అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం ఆన్‌లైన్ ద్వారానే షాట్స్ బుక్ చేస్తున్న టీకా కేంద్రాల గురించి కేంద్ర ప్రస్తావించింది. ఒక్కోసారి కొందరు టీకాను ఫలానా రోజు వేసుకుంటామని బుక్ చేసుకున్నప్పటికీ కొన్ని కారణాలతో తీరా ఆ రోజు వాళ్లు రాలేకపోవడంతో కొన్ని టీకాలు మిగులుతున్నాయని పేర్కొంది. ఇలాంటి వృథాను అరికట్టాలంటే టీకా కేంద్రాల్లోని పరిస్థితులను బట్టి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్‌కు అనుమతినిచ్చే నిర్ణయం తీసుకున్నామని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను జిల్లా అధికారులు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలి.