గ్రామాల్లో 100 శాతం టీకా పంపిణీ సాధ్యమే: డాక్టర్ వీకే పాల్

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో టీకా పంపిణీ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలకు తెరపడినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నూతన వ్యాక్సినేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తొలి రోజు(సోమవారం) 64శాతం పంపిణీ గ్రామాల్లోనే జరిగిందని, పట్టణ-గ్రామీణ జనాభా దామాషాలకు అనుగుణంగానే పంపిణీ ఉన్నదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. గ్రామాల్లో 63.68శాతం(56.09లక్షల డోసులు), పట్టణాల్లో 31.9 లక్షల డోసుల పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ గణాంకాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ 100 శాతం టీకా సాధ్యమేనని […]

Update: 2021-06-23 11:53 GMT

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో టీకా పంపిణీ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలకు తెరపడినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నూతన వ్యాక్సినేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తొలి రోజు(సోమవారం) 64శాతం పంపిణీ గ్రామాల్లోనే జరిగిందని, పట్టణ-గ్రామీణ జనాభా దామాషాలకు అనుగుణంగానే పంపిణీ ఉన్నదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.

గ్రామాల్లో 63.68శాతం(56.09లక్షల డోసులు), పట్టణాల్లో 31.9 లక్షల డోసుల పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ గణాంకాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ 100 శాతం టీకా సాధ్యమేనని భరోసానిస్తున్నాయని వివరించారు. మొత్తం టీకా కేంద్రాల్లో 71 శాతం గ్రామీణంలోనే ఉన్నాయని, ఇటీవలి వారాల్లో సగానికి ఎక్కువ ఇక్కడే వ్యాక్సినేషన్ జరిగిందని పేర్కొన్నారు. అయితే, టీకా పంపిణీపై మహిళల్లో మరింత అవగాహన కలిగించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు టీకా పొందిన వారిలో 53 శాతం పురుషులే ఉన్నారని, మహిళలు 46 శాతం మేర ఉన్నారని తెలిపారు.

Tags:    

Similar News