ఠాగూర్‌కు ఏం తెలుసు.. అధిష్టానంపై వీహెచ్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఈసారి తమ అధిష్టానంపైనే ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ అంశం పార్టీలో చిచ్చు రేపుతున్న విషయం తెలిసిందే. రేపో, మాపో పీసీసీ అధ్యక్షుడి పేరు అధికారిక ప్రకటన త్వరలో ఉండనుందన్న వార్తల నేపథ్యంలో తాజాగా వీహెచ్స్పందించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా […]
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఈసారి తమ అధిష్టానంపైనే ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ అంశం పార్టీలో చిచ్చు రేపుతున్న విషయం తెలిసిందే. రేపో, మాపో పీసీసీ అధ్యక్షుడి పేరు అధికారిక ప్రకటన త్వరలో ఉండనుందన్న వార్తల నేపథ్యంలో తాజాగా వీహెచ్స్పందించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా అదృష్టం బాగుండి కొనసాగుతున్నాడని ఉత్తమ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఏఐసీసీ నుంచి మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తారా అంటూ వీహెచ్ నిలదీశారు. పీసీసీ పీఠాన్ని బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని, ఇది జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బతినదా అంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏమిటని, పీసీసీని పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానానికి సూచించానని, దీనిపై తమ అధినేత్రి సోనియా గాంధీకి తాను లెటర్ రాశానన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తున్నానని, పార్టీని బలోపేతం చేయాలనే ఉద్ధేశంతో ఉన్న తనను కాంగ్రెస్‌లో నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారని వి. హనుమంతరావు వెల్లడించారు. అయినా తాను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని, సోషల్ జస్టిస్ కోసం పని చేస్తున్నానన్నారు. బీజేపీలో జనరల్ సెక్రటరీలు రాష్ట్రానికి వస్తే వారి పార్టీ కోసం కష్టపడుతున్నారని, కానీ తమ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయరని విమర్శించారు. కాగా వీహెచ్ లేఖను అటు మల్లు రవి తప్పు పట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై వీహెచ్చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. సీఎల్పీ నేతగా విక్రమార్క పనితీరు భేష్ అంటూ మల్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.