కొత్తిమీర.. ‘గిన్నీస్‌’ మీద

దిశ, వెబ్‌డెస్క్: వంటకాలకు అదనపు పరిమళాన్ని అందించి, కూర రుచిని ఒక్కసారిగా మార్చేసే ‘కొత్తిమీర’.. ఓ రైతు జీవితాన్ని కూడా అదే రీతిన మలుపు తిప్పింది. కొత్తిమీరతో లైఫ్ టర్నింగ్ కావడమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్కను పెంచినందుకుగాను ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ రైతుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించే అల్మోరా జిల్లాలోని బిల్కేష్ గ్రామానికి చెందిన ‘గోపాల్ […]

Update: 2020-06-04 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: వంటకాలకు అదనపు పరిమళాన్ని అందించి, కూర రుచిని ఒక్కసారిగా మార్చేసే ‘కొత్తిమీర’.. ఓ రైతు జీవితాన్ని కూడా అదే రీతిన మలుపు తిప్పింది. కొత్తిమీరతో లైఫ్ టర్నింగ్ కావడమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్కను పెంచినందుకుగాను ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ రైతుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించే అల్మోరా జిల్లాలోని బిల్కేష్ గ్రామానికి చెందిన ‘గోపాల్ దత్ ఉప్రెటి’ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. హిమాలయన్ వ్యవసాయ పద్ధతిలో కొత్తిమీర సాగు చేసే గోపాల్‌దత్ పెంచిన కొత్తిమీర మొక్కలు సహజంగా 4 నుంచి 5 అడుగుల పొడవుంటాయి. తాజాగా అతను పెంచిన ఓ కొత్తిమీర మొక్క మాత్రం ఏకంగా 7.1 అడుగులు పెరిగింది. దీంతో అతడు గిన్నిస్ బుక్‌కు అప్లయ్ చేశాడు. ఆ కొత్తిమీర మొక్కను ఏప్రిల్‌లో పరిశీలించిన గిన్నిస్ నిర్వాహకులు.. ప్రపంచంలోనే అతిపొడవైన కొత్తిమీరగా గోపాల్ దత్ మొక్కను గుర్తించినట్లు ఇటీవలే ప్రకటించారు. ఇంతకు ముందు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్క పొడవు 5.9 అడుగులుగా ఉండేది.

2011 నుంచి గోపాల్ దత్ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతకుముందు ఆయన ఢిల్లీలో కన్‌స్ర్టక్షన్ బిజినెస్‌లో పనిచేసేవారు. అల్లం, కొత్తిమీర సాగుతోపాటు గోపాల్ దత్ 2 వేల యాపిల్స్‌ను కూడా పండిస్తుండటం విశేషం.

Tags:    

Similar News