సీఎం కేసీఆర్‌కు ఉత్త‌మ్ లేఖ‌

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీలను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి సీఎం కేసీఆర్ కు శనివారం లేఖ రాశారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు ప్రతిరోజు 7 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారని వారు తెలిపారు. మండుటెండలో, అందులోనూ కొవిడ్ సమయంలో ఈ పనులు జరుగుతుండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఆటోలో కనీసం 14 నుంచి 15 […]

Update: 2021-05-22 11:50 GMT
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీలను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి సీఎం కేసీఆర్ కు శనివారం లేఖ రాశారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు ప్రతిరోజు 7 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారని వారు తెలిపారు. మండుటెండలో, అందులోనూ కొవిడ్ సమయంలో ఈ పనులు జరుగుతుండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఆటోలో కనీసం 14 నుంచి 15 మంది ప్రయాణిస్తున్నారని, ట్రాక్టర్లో అయితే సుమారు వంద మంది వెళ్తున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ రూపంలో ఇప్పటికే పేదలు కష్టాలు పడుతున్నారని, కనీస దూరం పాటించే అవకాశం లేకపోవడంతో చేసేదేం లేక పనులకు వెళ్తున్నారని వారు లేఖలో పేర్కొన్నారు. ఉపాధి పనులను వారి సొంత గ్రామల్లోనే చేపడితే ఇలాంటి ప్రమాదకర ప్రయాణాల బారినుంచి బయటపడుతారని వారు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Tags:    

Similar News