రేపు ప్రాణహితకు ఉత్తమ్

దిశ, ఆదిలాబాద్: నదీజలాల వినియోగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షలో భాగంగా శనివారం టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత నదీతీరంలో […]

Update: 2020-06-12 09:38 GMT

దిశ, ఆదిలాబాద్: నదీజలాల వినియోగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షలో భాగంగా శనివారం టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత నదీతీరంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ప్రాణహిత వద్ద జలదీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News