సోనియా గాంధీది చారిత్రాత్మక నిర్ణయం

• టీపీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్ పిలుపు దిశ, న్యూస్‌బ్యూరో : వలస కార్మికులందరికీ ప్రయాణ ఖర్చులు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీది చారిత్రాత్మక నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కొనియాడారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వలస కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. […]

Update: 2020-05-09 10:52 GMT

• టీపీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్ పిలుపు

దిశ, న్యూస్‌బ్యూరో :
వలస కార్మికులందరికీ ప్రయాణ ఖర్చులు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీది చారిత్రాత్మక నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కొనియాడారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వలస కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు చేసిన వాగ్ధానాలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించని కారణంగానే లాక్‌డౌన్ వల్ల కోట్లాది మంది వలస కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తిరిగి అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. 48 రోజులుగా లాక్‌డౌన్‌లో పేదలకు ఆహారం, ఇతర సహాయాలు అందిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన ప్రశంసించారు.

వలస కార్మికుల ప్రయాణ ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని సోనియా గాంధీ ప్రకటించిన తర్వాతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రకటించాడని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 3.5 లక్షల మంది వలస కార్మికులున్నారని స్వయాన ముఖ్యమంత్రే మీడియా సమావేశంలో చెప్పారన్నారు. ‘తర్వాత మీడియా సమావేశంలో ఆయనే ఆ సంఖ్యను 7.5 లక్షలు చేయగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 15 లక్షల మంది వలస కార్మికులున్నారని చెప్పడంలో వలస కార్మికుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ అజ్ఞానం తేటతెల్లమైంది’ అని ఉత్తమ్ విమర్శించారు.

Tags:    

Similar News