మూడ్రోజుల్లో అఖిలపక్ష సమావేశం: ఉత్తమ్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న పనులు, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై మూడ్రోజుల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వలస కూలీల పరిస్థితి, పేదలకు డబ్బులు, బియ్యం పంపిణీ తదితర అంశాలను సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ నేతల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే దేశం ఈ పరిస్థితి ఎదుర్కొంటుందన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో నిరుపేదలు, కూలీలు తీవ్ర […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న పనులు, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై మూడ్రోజుల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వలస కూలీల పరిస్థితి, పేదలకు డబ్బులు, బియ్యం పంపిణీ తదితర అంశాలను సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ నేతల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే దేశం ఈ పరిస్థితి ఎదుర్కొంటుందన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో నిరుపేదలు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం పట్టించుకోకుండా మీన మేషాలు లెక్కిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, ఆర్థిక సాయం విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని మండిపడ్డారు. తెల్ల రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లో 10లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారని, వారికి కూడా బియ్యం, రూ. 1500 అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
tags: coronavirus, all-party convention, tpcc uttukumar, congress, revenue offices, rice, essentials