బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్తున్నారా?
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ఫోన్ శరీరంలో ఒక భాగమైపోయింది. రక్తదానం, అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ, ఒక్క పది నిమిషాలు ఫోన్ ఇవ్వండని అడిగితే అందులో ఉన్న మెసేజ్‌లు, ఫొటోలన్నీ డిలీట్ చేసి, లాక్ వేసి గానీ ఇవ్వరు. ముఖ్యంగా తాను బాత్రూమ్‌కు వెళ్లినపుడు భార్య ఎక్కడ ఏమేం మెసేజ్‌లు చూస్తుందోనని భర్తలు ఫోన్‌లను బాత్రూమ్‌లకు కూడా తీసుకెళ్తున్నారు. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. బాత్రూమ్‌లో ఫోన్ తీసుకెళ్తే గంట, తీసుకెళ్లకపోతే రెండు నిమిషాలు […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ఫోన్ శరీరంలో ఒక భాగమైపోయింది. రక్తదానం, అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ, ఒక్క పది నిమిషాలు ఫోన్ ఇవ్వండని అడిగితే అందులో ఉన్న మెసేజ్‌లు, ఫొటోలన్నీ డిలీట్ చేసి, లాక్ వేసి గానీ ఇవ్వరు. ముఖ్యంగా తాను బాత్రూమ్‌కు వెళ్లినపుడు భార్య ఎక్కడ ఏమేం మెసేజ్‌లు చూస్తుందోనని భర్తలు ఫోన్‌లను బాత్రూమ్‌లకు కూడా తీసుకెళ్తున్నారు. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. బాత్రూమ్‌లో ఫోన్ తీసుకెళ్తే గంట, తీసుకెళ్లకపోతే రెండు నిమిషాలు అన్న చందంగా తయారయ్యారు. కానీ బాత్రూమ్‌కు ఫోన్ తీసుకెళ్లడం ఎంత వరకు శ్రేయస్కరం? రష్యాకు చెందిన ఒలేస్యా సెమెనోవా గురించి తెలిస్తే మీకే అర్థమవుతుంది.
24 ఏళ్ల ఈ రష్యన్ యువతి తన ఐఫోన్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లింది. అయితే చార్జింగ్ తక్కువగా ఉండటంతో అక్కడే ఉన్న ప్లగ్‌కు చార్జింగ్ పెట్టింది. ఎప్పటిలాగే తన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుండగా ఆ ఫోన్ జారి కమోడ్ మీది నుంచి బాత్‌టబ్‌లో పడింది. అప్పటికే కింద నీళ్లు ఉండటం, ఫోన్ చార్జింగ్ పెట్టి ఉండటం వల్ల షాక్ కొట్టి ఒలేస్యా చనిపోయింది. కాబట్టి ఇక నుంచి బాత్రూమ్‌కు ఫోన్‌ను తీసుకెళ్లేటప్పుడు కాస్త ఆలోచించండి. లేదు తప్పదు అనిపిస్తే.. ఫోన్ పెట్టుకోవడానికి, చార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా బాత్రూమ్‌లోనే ఏదైనా ప్రదేశం ఏర్పాటు చేసుకోండి. అంతేగానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి.