‘ఆన్‌లైన్ క్లాసులైతే అమెరికా రావొద్దు’
వాషింగ్టన్: అమెరికా సర్కారు విదేశీ విద్యార్థులపై మరోసారి ఆంక్షలతో కూడిన నిర్ణయాన్ని ప్రకటించింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులకే హాజరయ్యే విద్యార్థులకు అమెరికాలోకి అనుమతివ్వబోమని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాకు వచ్చే కొత్త విద్యార్థులపై వీసాపరమైన నిబంధనలు విధిస్తూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) ఈ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే అందిస్తున్న యూనివర్సిటీల విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాలని ఇటీవలే ఓ నిర్ణయాన్ని అమెరికా ప్రకటించి రద్దు చేసిన సంగతి తెలిసిందే. […]
వాషింగ్టన్: అమెరికా సర్కారు విదేశీ విద్యార్థులపై మరోసారి ఆంక్షలతో కూడిన నిర్ణయాన్ని ప్రకటించింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులకే హాజరయ్యే విద్యార్థులకు అమెరికాలోకి అనుమతివ్వబోమని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాకు వచ్చే కొత్త విద్యార్థులపై వీసాపరమైన నిబంధనలు విధిస్తూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) ఈ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే అందిస్తున్న యూనివర్సిటీల విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాలని ఇటీవలే ఓ నిర్ణయాన్ని అమెరికా ప్రకటించి రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హార్వర్డ్, ఎంఐటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలు సహా 18 రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. అనంతరం ఆ నిర్ణయాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. తాజాగా, దేశంలోకి వచ్చే కొత్త విద్యార్థులపై ఆంక్షలు విధిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. యూఎస్‌లో కరోనా వైరస్ తగ్గిందనడానికి సూచకంగా ఉండేలా వర్సిటీలు భౌతికంగా తరగతులు నిర్వహించాలనే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు ఈ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలున్నాయి. నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇది ఉపకరిస్తుందని భావించారని ఆరోపణలున్నాయి.