అమెరికా చేతిలో అల్ ఖైదా నేత హతం
ఉగ్రవాద నేతలను అగ్రదేశం ఏరి పారేస్తుంది. మరో కీలక ఉగ్రవాదిని అమెరికా హతమార్చింది. అల్ ఖైదా నేత (ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్-రిమిని చంపినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అల్ ఖైదా అంగీకరించిన.. కొన్ని రోజులకే ఖాసీం అల్-రిమిని చంపడం గమనార్హం. యెమెన్లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్ పెనిన్సులాలో ఖాసీం అల్-రమిని హతమార్చామని ట్రంప్ వెల్లడించారు. కాగా, గతేడాది […]
ఉగ్రవాద నేతలను అగ్రదేశం ఏరి పారేస్తుంది. మరో కీలక ఉగ్రవాదిని అమెరికా హతమార్చింది. అల్ ఖైదా నేత (ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్-రిమిని చంపినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అల్ ఖైదా అంగీకరించిన.. కొన్ని రోజులకే ఖాసీం అల్-రిమిని చంపడం గమనార్హం. యెమెన్లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్ పెనిన్సులాలో ఖాసీం అల్-రమిని హతమార్చామని ట్రంప్ వెల్లడించారు. కాగా, గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని అమెరికాకు చెందిన పెన్సకోలా వైమానిక స్థావరంలో భారీ ఎత్తున ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనికాధికారి మృతిచెందడంతో పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారంగా అల్ ఖైదా నేతను అమెరికా హత మార్చింది.