ఆ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు జరిమానా
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా కోర్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాణిజ్య భాగస్వామి యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు షాక్ ఇచ్చింది. బెంగళూరులో ఉన్న దేవాస్ మల్టీమీడియా స్టార్టప్ కంపెనీతో 2005లో శాటిలైట్ ఒప్పందం రద్దు చేసుకున్నందుకు యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ జరిమానా మన కరెన్సీలో రూ. 8.9 వేల కోట్లు. 2005లో రెండు ఉపగ్రహాలను సంబంధించి యాంట్రిక్స్, దేవాస్ మధ్య ఒప్పందం జరిగింది. రెండు ఉపగ్రహాలను తయారు […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా కోర్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాణిజ్య భాగస్వామి యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు షాక్ ఇచ్చింది. బెంగళూరులో ఉన్న దేవాస్ మల్టీమీడియా స్టార్టప్ కంపెనీతో 2005లో శాటిలైట్ ఒప్పందం రద్దు చేసుకున్నందుకు యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ జరిమానా మన కరెన్సీలో రూ. 8.9 వేల కోట్లు. 2005లో రెండు ఉపగ్రహాలను సంబంధించి యాంట్రిక్స్, దేవాస్ మధ్య ఒప్పందం జరిగింది.
రెండు ఉపగ్రహాలను తయారు చేసి అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఈ ఒప్పందం ఖరారైంది. అలాగే, నిర్వహణ బాధ్యత సైతం యాంట్రిక్స్ కంపెనీయే చూసుకోవాలని స్పష్టం చేసింది. వీటినుంచి 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్ కంపెనీ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఒప్పందానికి సంబంధించి అవకతవకలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో 2011లో ఈ ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసుకుంది. దీనిపై దేవాస్ కంపెనీ భారత్‌లోని సుప్రీంకోర్టుతో పాటు వివిధ కోర్టులను ఆశ్రయించింది. ఇస్రోలో పనిచేసిన మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన దేవాస్ మల్టీమీడియాలో అమెరికా వెంచర్స్ కేపిటలిస్టులు ఇన్వెస్ట్ చేశారు.
ఈ క్రమంలో 2018లో అమెరికాలోని కోర్టులో కేసు నమోదైంది. ఈ ఒప్పందం రద్దును 3 అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లు, 9 ఆర్బిటరీ సంస్థలు తప్పుబట్టాయని దేవాస్ కంపెనీ వివరించింది. అదే సంవత్సరంలో న్యాయ కారణాలతో దేవాస్ వేసిన కేసును కోట్టేయాలని యాంట్రిక్స్ పిటిషన్ వేసింది. పిటిషన్‌ను తిరస్కరించిన అమెరికా కోర్టు, ఈ అంశం తమ పరిధిలోకి వస్తుందని, వాదనలు విన్న తర్వాత 562.5 మిలియన్ డాలర్లు పరిహారంగా దేవాస్ కంపెనీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీనికి వడ్డీని లెక్కించి మొత్తం రూ. 1.2 బిలియన్ డాలర్లు(రూ. 8.9 వేల కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చింది.