‘కరోనా’ దెబ్బకు యూఎస్ పౌరుడు బలి!

          కరోనా దెబ్బకు కేవలం చైనీయులే కాకుండా ఆ దేశంలో బతికేందుకు వచ్చిన వారు కూడా ప్రాణాలు కోల్పొతున్నారు. తాజాగా చైనా దేశంలో జీవిస్తున్న ఓ అమెరికన్ ఈ వైరస్ సోకి మృతి చెందినట్టు ఆ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ వ్యాధితో మృతి చెందిన తొలి విదేశీయుడు కూడా ఇతడే కావచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వూహాన్ నగరంలో చికిత్స పొందుతూ అతడు ఫిబ్రవరి 6న మృతి చెందినట్టు వెల్లడించింది. […]

Update: 2020-02-08 10:39 GMT

కరోనా దెబ్బకు కేవలం చైనీయులే కాకుండా ఆ దేశంలో బతికేందుకు వచ్చిన వారు కూడా ప్రాణాలు కోల్పొతున్నారు. తాజాగా చైనా దేశంలో జీవిస్తున్న ఓ అమెరికన్ ఈ వైరస్ సోకి మృతి చెందినట్టు ఆ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ వ్యాధితో మృతి చెందిన తొలి విదేశీయుడు కూడా ఇతడే కావచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వూహాన్ నగరంలో చికిత్స పొందుతూ అతడు ఫిబ్రవరి 6న మృతి చెందినట్టు వెల్లడించింది. మరోవైపు..జపాన్ దేశస్థుడు కూడా కరోనా సోకి మృతి చెందినట్టు చైనా అధికారులు భావిస్తున్నారు.కానీ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు వారు సంసిద్ధత ప్రకటించడం లేదని సమచారం. కాగా ఇప్పటి వరకూ చైనాలో కరోనా సోకి 724 మంది మృతి చెందినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి

Tags:    

Similar News