బ్లాక్ మెయిల్ తర్వాత తెరపైకి ఊర్మిళ
దిశ, సినిమా : బాలీవుడ్ భామ, రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ హీరోయిన్‌గానే కాదు.. రాజకీయ నాయకురాలిగా కూడా సుపరిచితమే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊర్మిళ.. ఆర్నెళ్లు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, శివసేనలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మహారాష్ట్ర మగువ మరోసారి వెండితెర మీద కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. చివరిసారిగా 2018 విడుదలైన ‘బ్లాక్‌మెయిల్’ పాటలో కనిపించిన ఊర్మిళ.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు […]
దిశ, సినిమా : బాలీవుడ్ భామ, రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ హీరోయిన్‌గానే కాదు.. రాజకీయ నాయకురాలిగా కూడా సుపరిచితమే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊర్మిళ.. ఆర్నెళ్లు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, శివసేనలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మహారాష్ట్ర మగువ మరోసారి వెండితెర మీద కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. చివరిసారిగా 2018 విడుదలైన ‘బ్లాక్‌మెయిల్’ పాటలో కనిపించిన ఊర్మిళ.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించింది.
‘నా కెరీర్ చూసుకుంటే.. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాను. ఒకవేళ నేను ఏదైనా పాత్ర ఒప్పుకుంటే, అది నా కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ఉండాలి. అలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడే నేను న్యూ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకుంటాను. అయితే గత ఏప్రిల్‌లో నాకో స్క్రిప్ట్ బాగా నచ్చింది. ఆ వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా చేశాం. కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని అనుమతి సమస్యల కారణంగా ఆలస్యమవుతున్నందున.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో పక్కాగా చెప్పలేం. కానీ తప్పకుండా అందులో నటిస్తాను, మీరు త్వరలోనే నన్ను తెరపై చూస్తారు’ అని ఊర్మిళ తెలిపింది.