పెరుగుతున్న యూపీఐ లావాదేవీలు!

దిశ, వెబ్‌డెస్క్: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు నవంబర్‌లో వరుసగా 6.7 శాతం పెరిగి 220 కోట్లకు చేరుకున్నాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది. 2019, నవంబర్ నాటికి ఇది 121 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2020లో కరోనా వల్ల దేశీయ ప్రజలు నగదు బదిలీల కోసం ఆన్‌లైన్ చెల్లింపుల పైనే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో యూపీఐ లావాదేవీల విలువ ఏకంగా 105 శాతం వృద్ధి నమోదైందని ఎన్‌పీసీఐ తెలిపింది. 2019, డిసెంబర్ చివరికి యూపీఐ లావాదేవీల మొత్తం విలువ […]

Update: 2021-01-03 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు నవంబర్‌లో వరుసగా 6.7 శాతం పెరిగి 220 కోట్లకు చేరుకున్నాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది. 2019, నవంబర్ నాటికి ఇది 121 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2020లో కరోనా వల్ల దేశీయ ప్రజలు నగదు బదిలీల కోసం ఆన్‌లైన్ చెల్లింపుల పైనే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో యూపీఐ లావాదేవీల విలువ ఏకంగా 105 శాతం వృద్ధి నమోదైందని ఎన్‌పీసీఐ తెలిపింది.

2019, డిసెంబర్ చివరికి యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ. 2,02,520 కోట్లుగా నమోదైంది. ఎన్‌పీసీఐ అధికారిక వివరాల ప్రకారం..ఇది 2020, డిసెంబర్ చివరి నాటికి యూపీఐ లావాదేవీల విలువ రూ. 4,16,176 కోట్లకు పెరిగింది. కాగా, 2020, సెప్టెంబర్‌లోనే యూపీఐ లావాదేవీల విలువ రూ. 3 లక్షల కోట్ల మార్కును చేరుకుంది. యూపీఐ ద్వారా 2019, డిసెంబర్ నాటికి మొత్తం 130 కోట్ల లావాదేవీలు జరిగాయి.

2020, డిసెంబర్ నాటికి కొవిడ్-19 వల్ల 223 కోట్లకు చేరుకుంది. యూపీఐ లావాదేవీలు అక్టోబర్ నెల నుంచి ప్రతినెలా 200 కోట్లను దాటుతోంది. ‘ఇటీవల యూపీఐ లావాదేవీల చేసేవారు పెరుగుతున్నారు. దీంతో యూపీఐ లావాదేవీలు 10 రెట్ల వృద్ధిని సాధించాయని’ ఎన్‌పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ గత నెలలో చెప్పారు.

Tags:    

Similar News